Kusukuntla Prabhakar Reddy | చండూరు,ఆగస్టు 02: ఇటీవల అనారోగ్యంతో రెండు కిడ్నీలు ఇన్స్పెక్షన్ వచ్చి, లంగ్స్ (ఊపిరితిత్తులు) ఇన్స్పెక్షన్ తో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు, 7వ వార్డు మెంబర్ రేవల్లి నరేష్‌ను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం నిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన నిమ్స్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి నరేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని, అతనికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడవద్దని మీకు అండగా నేనున్నా అని నరేశ్‌కు, వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కూసుకుంట్ల ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణమే తన వంతుగా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో బోడంగిపర్తి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య, 2 వార్డ్ మెంబర్ వట్టికోటి శ్రీనివాస్, వర్కాల శ్రవణ్, ఎండి సత్తార్, రేవెల్లి శ్రీను,రేవెల్లి మహేష్, వర్కాల అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
