Parineeti Chopra | తల్లిగా మారిన తర్వాత తన అనుభవాల గురించి బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నీర్‌ను వదిలి తొలిసారి పని కోసం ప్రయాణించినప్పుడు తాను మామ్ గిల్ట్‌కు (తీవ్రమైన అపరాధ భావన) గురయ్యానని తెలిపారు.
ప్రసవం తర్వాత చాలా నెలలు బాబుతోనే ఉన్న తాను, తొలిసారి దూరంగా ప్రయాణిస్తున్నప్పుడు విమానంలో దాదాపు మూడు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నానని, ఆ ప్రయాణం తనకు సరిగ్గా గుర్తులేదని ఆమె భావోద్వేగంగా చెప్పారు. ఇంట్లో కుటుంబ సభ్యులు బాబును బాగా చూసుకుంటున్నా, మీ బాబు ఎక్కడ? అంటూ సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నలు తల్లులపై మరింత మానసిక ఒత్తిడిని పెంచుతాయని ఆమె పేర్కొన్నారు. కాగా, రాఘవ్ చద్దా, పరిణీతి దంపతులకు అక్టోబర్ 19, 2025న బాబు (నీర్) జన్మించాడు. ప్రస్తుతం పరిణీతి తన రీఎంట్రీ ప్రాజెక్ట్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘షక్: ట్రస్ట్ నో వన్’ షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.