Bengaluru: ఇద్దరు అమ్మాయిలు.. ఓ ఆటో డ్రైవర్.. బెంగుళూరులో కొట్టుకున్నారు.. వీడియో
Bengaluru: ఓ ఆటో డ్రైవర్, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగుళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ థార్డ్ సెక్టార్లో జరిగింది. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగుళూరు: ఓ ఆటో డ్రైవర్, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగుళూరు(Bengaluru)లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ థార్డ్ సెక్టార్లో జరిగింది. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆటోడ్రైవర్, ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నా.. వారిని ఎవరూ ఆపలేకపోయారు. చివరకు ఓ అమ్మాయి వచ్చి ఆ గొడవను ఆపింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆటోడ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేశారు.
వీడియోను చూసిన తర్వాత హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు ఆ అమ్మాయిలతో కాంటాక్ట్ అయ్యారు. ఫిర్యాదు చేయాలని కోరారు. కానీ ఆ అమ్మాయిలు మరో రెండు రోజుల సమయం అడిగినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. తన ఆటోను హైర్ చేసిన ఆ అమ్మాయిలు.. పేమెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న అమ్మాయిలు పేమెంట్ ఇవ్వలేదన్నాడు. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Kalesh b/w a Group of Girls and Auto Driver over Fare issues, HSR Layout Bengaluru pic.twitter.com/gNAxhfVs93
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 29, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

