ముంబై: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ రంజీ ట్రోఫీ ఫైనల్లోకి తొలిసారి ప్రవేశించింది. రెండు సార్లు చాంపియన్ అయిన బెంగాల్‌పై సెమీస్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కళ్యాణిలో జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇవాళ రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్ 126 టార్గెట్‌ను చేజ్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో రంజీ టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారి జమ్మూకశ్మీర్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ జట్టు విజయంలో అబ్దుల్ సమద్, అకీబ్ నబీ, వన్షాజ్ శర్మ కీలక పాత్ర పోషించారు. అబ్దుల్ సమ్ తొలి ఇన్నింగ్స్‌లో 82, రెండో ఇన్సింగ్‌లో 30 రన్స్ చేశాడు. నబీ ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో శర్మ అజేయంగా 43 రన్స్ చేశాడు.
హిమాలయ ప్రాంతానికి చెందిన ఓ జట్టు రంజీ ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. తొలుత టాస్ గెలిచి జమ్మూకశ్మీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బెంగాల్ 328 రన్స్‌కు ఆలౌటైంది. సుదీప్ కుమార్ ఆ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 146 రన్స్ చేశాడు. ఇక జమ్మూకశ్మీర్ తన తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకే ఆలౌటైంది. 26 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్‌కు మొత్తం 126 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. అయితే ఆ టార్గెట్‌ను జమ్మూకశ్మీర్ 4 వికెట్లు కోల్పోయి అందుకున్నది. బెంగాల్ బౌలర్ మొహమ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. అతను ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే ఏకంగా 8 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే.
𝙎𝘾𝙀𝙉𝙀𝙎 𝙊𝙁 𝙋𝙐𝙍𝙀 𝙅𝙐𝘽𝙄𝙇𝘼𝙏𝙄𝙊𝙉 🤩
J&K create history as they defeat Bengal by 7️⃣ wickets to book their ticket to the #RanjiTrophy Final for the very first time 🫡
Scorecard ▶️ https://t.co/QXyCuRHJ6e@IDFCFIRSTBank pic.twitter.com/VBKPD9I9mX
— BCCI Domestic (@BCCIdomestic) February 18, 2026