WTC Final | జూన్ 9న డబ్ల్యూటీసీ ఫైనల్.. రెండోసారి ఆ మైదానంలోనే బిగ్‌ఫైట్..!
WTC Final : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరోమారు ఇంగ్లండ్ (England)కే పట్టం కట్టింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27Final ) ఆతిథ్య హక్కులను వరసగా మూడోసారి ఆ దేశానికే కట్టబెట్టింది.
WTC Final : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మరోమారు ఇంగ్లండ్(England)కే పట్టం కట్టింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27Final ) ఆతిథ్య హక్కులను వరసగా మూడోసారి ఆ దేశానికే కట్టబెట్టింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓవల్ (Oval)మైదానంలో జరుగనుంది. మరో మూడు పర్యాయాలు ఇంగ్లండ్‌కే అవకాశం ఇస్తామని పేర్కొన్న ఐసీసీ చెప్పినట్టే వేదికను ఖరారు చేసింది. ఆరంభ ఎడిషన్‌లో భారత్, న్యూజిలాండ్ ఇదే మైదానంలో తలపడగా.. ఈసారి కూడా టెస్టు గద పోరు ఇక్కడే జరుగనుంది. జూన్ 9వ తేదీ నుంచి మ్యాచ్ నిర్వహించనున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 20225-27 ఫైనల్ తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ 9న ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో టైటిల్ పోరు జరుగనుంది. తొలి సీజన్ 2021-23 ఫైనల్ ఇదే స్టేడియంలో నిర్వహించిన ఐసీసీ.. మరోమారు ఓవల్‌కు అవకాశమిచ్చింది. అయితే.. 2023-25 మాదిరిగా లార్డ్స్ స్టేడియంలోనే ఫైనల్ జరపాలని తొలుత ఐసీసీ భావించింది.
BREAKING: The Oval will host next year’s World Test Championship Final from June 9-13 2027 🏆 pic.twitter.com/Q17i1coWom
— Cricinfo (@cricinfo) July 23, 2026
కానీ, ఇటీవలే ఈ మైదానంపై ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వేదికను మార్చాలని ఇంగ్లండ్ వేల్స్ బోర్డు అభ్యర్థించింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్టు అనంతరం లార్డ్స్ పిచ్ ఏమంత బాగాలేదని నివేదిక రావడమే అందుకు కారణం. దాంతో.. మరోసారి ఓవల్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహించే అవకాశం లభించింది. జూన్ 9 నుంచి 13 వరకూ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
టాప్‌లో ఆసీస్, దక్షిణాఫ్రికా
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. గత ఎడిషన్ విజేత దక్షిణాఫ్రికా, తొలి సీజన్ ఛాంపియన్ న్యూజిలాండ్ వరసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. చూస్తుంటే.. ఈసారి ఫైనల్లో ఆసీస్, సఫారీలు లేదా.. ఆసీస్, కివీస్ తలపడే అవకాశముంది.
🚨𝐈𝐂𝐂 𝐖𝐓𝐂 2025-27 𝐏𝐎𝐈𝐍𝐓𝐒 𝐓𝐀𝐁𝐋𝐄 𝐔𝐏𝐃𝐀𝐓𝐄🚨
🇮🇳Team India are currently placed at No. 6 in the World Test Championship standings.
📊Despite the position, India still have 9 Test matches remaining in the cycle, giving them a strong opportunity to climb the table pic.twitter.com/wELBk3VQbs— Sports Nexus (@SportsNexusNews) June 22, 2026
ఎందుకంటే ఈ మూడు జట్లు మాత్రమే ఈ సైకిల్లో మరో 10 మ్యాచులు ఆడనున్నాయి. ఇప్పటికైతే బంగ్లాదేశ్ నాలుగులో, వరసగా రెండు ఫైనల్స్ ఆడిన భారత జట్టు ఐదో ప్లేస్‌లో నిలిచాయి. శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచి.. ఫైనల్ బెర్తుకు ఆమడ దూరంలో ఉండిపోయాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

