కృత్రిమ మేధతో భద్రం: ఐఆర్డీఏఐ
దేశీయ బీమా రంగంలో దాదాపు 85 శాతం కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వాడుతున్నాయని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) స్పష్టం చేసింది.
ముంబై, నవంబర్ 20: దేశీయ బీమా రంగంలో దాదాపు 85 శాతం కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఏఐ)ను వాడుతున్నాయని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) స్పష్టం చేసింది. అయితే ఈ సాంకేతికతకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడంతోపాటు కీలక నిర్ణయాలపై మనుషుల నియంత్రణ ఉండేలా చూడాలని ఐఆర్డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్ ఇన్సూరర్లకు సూచించారు.
సెబీ మాజీ చైర్మన్ ఎం డామోదరన్ నిర్వహించిన గేట్‌కీపర్స్ ఆఫ్ గవర్నెన్స్ 2026 కార్యక్రమంలో సేథ్ మాట్లాడారు. బ్యాంకులు బీమా ఉత్పత్తులను విక్రయించడం, ఆటోమొబైల్ డీలర్లు బీమా పంపిణీతోపాటు వాహనాల మరమ్మతు సేవలను అందించడం వల్ల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని చెప్పారు. ఈ క్రమంలోనే బీమా పాలసీల రిస్క్ అంచనా, క్లెయిమ్‌ల పరిష్కారంలో ఏఐ విస్తృత వినియోగంతో వచ్చే ముప్పులను కూడా ప్రస్తావించారు. కాగా, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో పారదర్శకత పెంచేందుకు 10 రోజుల్లో 2 కార్యబృందాలను ఏర్పాటు చేయాలని ఐఆర్డీఏఐ యోచిస్తున్నట్టు సేథ్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

