న్యూఢిల్లీ: సినీ నటి, మోడల్ తేజస్విని కోల్హాపురి(Tejaswini Kolhapure).. తాజాగా ఓ పోడ్కాస్ట్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ కోసం ఐవీఎఫ్ చేయించుకున్న తీరు గురించి ఆమె హృదయవిదారకర పరిస్థితిని వివరించింది. సిద్ధార్ధ కన్హన్తో జరిగిన పోడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలు కనేందుకు చాలా ఇబ్బందిపడినట్లు చెప్పింది. ఒకప్పటి సినీ నటి పద్మిని కొల్హాపురి సోదరియే తేజస్విని. బాలీవుడ్ నటులు శ్రద్ధా కపూర్, సిద్ధాంత్ కపూర్లకు వరుసకు మేనత్త అవుతుంది. అయితే ఐవీఎఫ్ విధానం వల్ల తీవ్రమైన మానసిక, శారీరక బాధను అనుభవించాల్సి వచ్చినట్లు చెప్పిందామె. తన జీవితంలో అదో సంక్లిష్టమైన దశ అని ఆమె తెలిపారు.
అయిదు సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నట్లు తేజస్విని చెప్పింది . దీని గురించి ఓపెన్‌గానే మాట్లాడుతాను. ఐవీఎఫ్ పద్ధతి చాలా కష్టమైందన్నారు. మొదటిసారి, రెండోసారి సమస్య తీవ్రంగా ఉంటుందని, ఇక ఆ తర్వాత మూడు, నాలుగు, అయిదోసారి పర్వాలేదనిపిస్తుందన్నారు. మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలని, ఇంజెక్షన్ల కోసం ప్రతిసారి క్లినిక్‌లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. చాలా నొప్పిని తట్టుకోవాల్సి వస్తుందన్నారు. చాలా ఆలస్యంగా పిల్లలు కనాలని అనుకున్నానని, కానీ 35 ఏళ్ల లోపే పిల్లల్ని కనాలని సలహా ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.
మానసికంగా తాను ధైర్యంగా ఉన్నానన్నారు. కానీ శారీరకంగా ఇబ్బంది పడాల్సి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఐవీఎఫ్ చికిత్స వల్ల తన బాడీ షేప్ మారినట్లు ఆమె పేర్కొన్నది. వందల సంఖ్యలో ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల ఆ సమస్య వచ్చిందన్నారు. సుమారు వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నట్లు తేజస్విని చెప్పింది. ప్రెగ్నెన్సీ ఓకే అయిన తర్వాతే ఇంజెక్షన్లను ఆపేస్తారని తేజస్విని పేర్కొన్నది. ప్రెగ్నెన్సీ కోసం చాలా ఇబ్బంది పడ్డానని, అయిదు సార్లు ఐవీఎఫ్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయిదోసారి లక్కీగా జరిగిందన్నారు. మధ్యలో రెండు సార్లు మిస్ క్యారేజ్ అయ్యిందన్నారు.
ఫిల్మ్‌మేకర్, నటుడు పంకజ్ సరస్వత్ను తేజస్విని కొల్హాపురి పెళ్లి చేసుకున్నది. ఆ ఇద్దరికీ అమ్మాయి పుట్టింది. పెళ్లి అయిన 8 ఏళ్లకు వారికి సంతానం కలిగింది. 2015, జనవరి 30వ తేదీన కూతురు వేదిక పుట్టింది.