కోదాడ, జూలై 23 : కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు కేక్ కట్ చేసి కేటీఆర్కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా 25 మంది ఆటో కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. నిత్యం కష్టపడి జీవనం సాగించే ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తమ నేత కేటీఆర్ భవిష్యత్లో మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో మాజీ సర్పంచ్ అనంతుల సైదయ్య, కౌన్సిలర్ చంద్రశేఖర్, బత్తుల కృష్ణ, వీరబాబు, మాజీ కౌన్సిలర్ లలిత, చందు, వెంకటి, వెంకన్న, సీత్తయ్య, సిలర్, అఖిల్, మున్నా, లింగ, ఆటో యూనియన్ నాయకులు బోధల్, కిషోర్ పాల్గొన్నారు.