ముంబై: ఉద్యోగాలు, విద్యలో ముస్లిం(Muslim Quota)లకు ఉన్న అయిదు శాతం రిజర్వేషన్ను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం దీనికి సంబంధించిన ప్రభుత్వ తీర్మానం జారీ చేశారు. గతంలో జారీ చేసిన అయిదు శాతం ఆర్డినెన్స్ కాలం ముగిసింది. ఆ నిర్ణయంపై కోర్టు స్టే కూడా ఇచ్చింది. గత కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం విద్య, ఉద్యోగ అకాశాల్లో జాబ్ కొట్టే రీతిలో మరాటాలకు 16 శాతం, ముస్లింలకు అయిదు శాతం రిజర్వేషన్ కోటా కల్పించింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు. వెనుకబడి తరగతుల కింద ముస్లిం గ్రూపులకు విద్యను, ఉద్యోగాలను అందించేందుకు అయిదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెబుతూ ఆర్డనెన్స్ జారీ చేశారు. 2014లో జారీ చేసిన సర్క్యూలర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ముస్లింలకు ఓబీసీ కింద కుల ద్రవీకరణ పత్రాలు, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్లను ఇవ్వడం మానేసింది.