హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్విమ్మర్ షేక్ సాజిదా ఆసియా మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించిది. తెలంగాణ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమె రెండు పతకాలతో మెరిసింది.
మేడ్చల్‌కు ప్రాతినిధ్యం వహించిన సాజిదా మహిళల 35-39 ఏజ్ గ్రూప్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో 1 నిమిషం 04.19 సెకండ్ల టైమింగ్‌తో స్వర్ణం, 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రెండో స్థానంతో రజతం అందుకుంది. అక్టోబర్‌లో బెంగళూరు వేదికగా జరిగే ఆసియా మాస్టర్స్‌లో తను ఈ రెండు విభాగాల్లో పోటీ పడనుంది.