కరీమాబాద్, సెప్టెంబర్ 20: ప్రభుత్వ సహకారంతో బతుకమ్మ, దసరా ఉత్సవాలు అదిరేలా ఏర్పాట్లు చేస్తా మని కలెక్టర్ గోపి అన్నారు. మంగళవారం ఉర్సు రంగ లీల మైదానంలో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కుడా, వరంగల్ మహానగరపాలక సంస్థ, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్టీసీ, ఐఅండ్‌పీఆర్, రోడ్లు భవనాల శాఖ తదిత ర అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్సవాలను విజయవంతంగా నిర్వ హించాలన్నారు. ఏర్పాట్లలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించే లా ఆర్టీసీ అధికారులు చొరవ చూపాలని సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాల నేప థ్యంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా బందోబస్తు ను నిర్వహిస్తామన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా మని, సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెడతా మని చెప్పారు. కుడా చైర్మన్ సుందర్రాజ్ మాట్లాడుతూ ఉత్స వాలకు కుడా తరఫున పూర్తిస్థాయిలో సహాయ సహకా రాలు అందిస్తామన్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ బల్దియా ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్లు, స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుధ్య, ప్యా చ్వర్క్, నీటి వసతి, లైటింగ్, ప్రత్యేక మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపురి సంజయ్‌బాబు మాట్లాడు తూ భూమి విషయంలో ఇబ్బందులు పడుతున్నామని, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్ల రవి, పల్లం పద్మ, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, దసరా కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ఉత్సవ కమిటీ ట్రస్టు అధ్యక్షుడు వంగరి కోటేశ్వర్, గౌరవ సభ్యుడు మండ వెంకన్నగౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులు వం చనగిరి సమ్మయ్య, గోనె రాంప్రసాద్, వొగిలిశెట్టి అనిల్ కుమార్, పొగాకు సందీప్, దామెరకొండ వెంకటే శ్వర్లు, నాగపురి రంజిత్, కార్యదర్శులు బజ్జూరి వాసు, సుంకరి సంజీవ్, బొల్లం ప్రతాప్, నాగపురి అశోక్, కమిటీ సభ్యు లు నాగపురి మహేశ్, గట్టు గోవర్ధన్, నాగపురి కాళిదా సు, నాగపురి సంతోష్, పొగాకు చిరంజీవి, బిట్ల క్రాంతి, మఠం రాజు, బొమ్మల్ల అంబేద్కర్, నరిగె శ్రీను, అక్తర్, పూజారి విజయ్, మీరిపెల్లి వినయ్, మోడెం రాజ శేఖర్, బైరగోని మనోహర్, శ్రీరాముల చరణ్, ఎలగందుల కృష్ణమూర్తి, బత్తిని వంశీ, పరదేశి రాజేశ్ పాల్గొన్నారు.
అధికారికంగా జరిపేలా చర్యలు
ఉత్సవాలను అధికారికంగా ని ర్వహించేలా అందరం కృషి చేయా లి. పోలీస్ శాఖ మహిళా పోలీసుల ను ఎక్కువ సంఖ్యలో నియ మించాలి. పండుగలను సంతోషంగా జరుపోవాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఈ ప్రాంతం అభివృద్ధికి అందరూ కృషి చేయాలి.
– ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
మైసూర్ తర్వాత ఇక్కడే..
మైసూర్ తర్వాత ఉత్సవాలు ఇక్కడే ఘనంగా జరుగుతాయి. ఎక్కువగా గ్రీన్ టపాసులు కాల్చే లా చూడాలి. ఇక్కడి ఉత్సవం గు రించి అందరూ మాట్లాడుకోవాలి. రంగలీల మైదానం కోసం గతంలో చాలా మంది పోరాటాలు చేశారు.
– ఎమ్మెల్సీ బండా ప్రకాశ్