బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహిళలకు కానుకగా ఉచితంగా చీరెలను అందిస్తున్నది. ఈ యేడు కూడా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జిల్లాకు 2.72 లక్షలు కేటాయించింది. తీరొక్క రంగుల్లో, వివిధ డిజైన్లలో తయారుచేసిన చీరెలను కొద్ది రోజుల నుంచి దశల వారీగా జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. వీటిని అధికారులు వరంగల్ ఎనుమాముల, నర్సంపేట వ్యవసాయ మార్కెట్లోని గోదాముల్లో భద్రపరుస్తున్నారు. ఈ చీరెలను నేటి నుంచి గ్రామాలకు తరలించనున్నారు. రేపటి నుంచి మహిళలకు అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వరంగల్, సెప్టెంబర్ 20(నమస్తేతెలంగాణ): బతు కమ్మ చీరెల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేపట్టా రు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బతుకమ్మ చీరలను బుధవారం నుంచి గ్రామాలకు సరఫరా చేసేందుకు నిర్ణయించారు. మూడు రోజుల్లో ప్రతి గ్రామం, వార్డు, డివిజన్‌కు బతుకమ్మ చీరలను చేర్చేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటిని గురు వారం నుంచి మహిళలకు పంపిణీ చేయడం ప్రారం భం కానుంది. బతుకమ్మ పండుగను పురస్కరించు కుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది అందజేసేందుకు జిల్లాకు 2.72 లక్షల చీరెలను కేటా యించింది. కొద్ది రోజుల నుంచి దశల వారీగా వస్తున్న చీరెలను అధికారులు వరంగల్ ఎనుమాముల, నర్సం పేట వ్యవసాయ మార్కెట్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు.
చీరెల పంపిణీకి సన్నాహాలు
బతుకమ్మ చీరెల పంపిణీకి ప్రజాప్రతినిధులు, అధి కారులు సిద్ధమవుతున్నారు. గురువారం నుంచి జిల్లా లో మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్ర మాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలతోపాటు జడ్పీటీ సీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్ర జాప్రతినిధులు, అధికారులు బతుకమ్మ చీరె ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నర్సంపే ట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లోని గ్రామాలకు బుధవారం నర్సంపేటలోని గోదాము నుంచి బతుకమ్మ చీరెలను తరలించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సంపత్‌రావు చెప్పారు. గురువారం ఎను మాముల మార్కెట్లోని గోదాము నుంచి గీసుగొండ, సంగెం, పర్వతగిరి, రాయపర్తి, వర్ధ న్నపేట మండలా ల్లోని గ్రామాలకు బతుకమ్మ చీరెలను పంపేందుకు ప్లాన్ చేసినట్లు ఆయన తెలిపారు. శుక్ర వారం వరంగల్, ఖిలావరంగల్ మండలాలకు ఎను మాముల గోదాము నుంచి బతుకమ్మ చీరెలు చేరు కుంటాయని డీఆర్డీవో వెల్లడించారు. గురువారం కొన్ని మండలాల్లో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్ర మం ప్రారంభం కావొచ్చని సంపత్‌రావు తెలిపారు.
నర్సంపేట, ఎనుమాముల గోదాముల నుంచి బతుక మ్మ చీరెలను గ్రామాలకు చేర్చేందుకు అవసరమైన ఏ ర్పాట్లు జరిగాయని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దయాకర్ చెప్పారు. ఆయా గ్రామానికి కేటాయించిన బతుకమ్మ చీరెలను మండల అధికారులు వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్తారని ఆయన తెలిపారు. జిల్లాలో పద్దెనిమిదేళ్ల కుపైగా వయసు గల మహిళ లందరికీ బతుకమ్మ కానుకగా చీరెలను ఉచితంగా పంపిణీ చేసేందుకు అధికారులు ప్లాన్ చేశారు.
మండలాల వారీగా కేటాయించిన బతుకమ్మ చీరెలు
మండలం : చీరలు
చెన్నారావుపేట : 12,950
దుగ్గొండి : 14,310
గీసుగొండ : 18,121
ఖానాపురం : 10,473
నల్లబెల్లి : 11,886
నర్సంపేట : 22,583
నెక్కొండ : 16,534
పర్వతగిరి : 15,178
రాయపర్తి : 17,407
సంగెం : 14,805
వర్దన్నపేట : 15,334
ఖిలావరంగల్ : 49,782
వరంగల్ : 53,265
మొత్తం : 2,72,627