ఆర్థిక పరిస్థితి బాగాలేదని తాపీమేస్త్రీ.. భర్తతో గొడవనో లేక మరే కారణమో రెండేళ్ల కూతురితో ఓ వివాహిత రైలు పట్టాలపై, ప్రజలను భయపెట్టేలా దెయ్యం వీడియో పెట్టి దొరికిన భయంతో యువకుడు పురుగుల మందు తాగి సెల్ఫీ వీ�
వరంగల్ శివనగర్‌లో కరెన్సీ గణనాథుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వినాయక ఉత్సవ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి రూ.కోటిన్నర నగదుతో అలంకరించి ధనలక్ష్మి పూజ చేశారు.
వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తున్నది. స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి తన పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా మార్పిడి చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కోమితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వరంగల్ జిల్లాలో గత నెలలో కొన్ని చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపి ణీ పదిహేను రోజులు ఆలస్యమైంది. పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికా�
మెరిసే విప్లవ ధ్రువతార.. దొ రల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆ�
అక్రమంగా నిల్వ చేసిన 172 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. అయితే సివిల్ సప్లయ్ సంచులతోనే అవి పట్టుబడడం సంచలనంగా మారింది.
నకిలీ సర్టిఫికెట్ల బాగోతంలో ప్రధాన సూత్రధారి మన్యం సిద్ధయ్యను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ప్రధాన సూత్రధారి అయిన మన్యం సిద్ధయ్య �
ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మ
సీరోలు సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వర్తించే మూడు నరేందర్ ద్వారానే ఆకేరు వాగు నీటి ఉధృతిలో మరిపెడ మండలం సీతారాంతండా మునిగిపోతుందని బయట ప్రపంచానికి తెలిసింది. సీరోలులో విద్యుత్ శాఖలో పనిచేస్త�
మండలంలో వెంకటాపురం-తోపనపల్లి మధ్య రెండు లోలెవల్ కాజ్‌వేల నడుమ ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో ప్రయాణీకులు రాత్రంతా అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం అధికారులు సురక్షితంగా తరలించారు.
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు.
యూరియా బస్తాల కోసం కొద్ది రోజులుగా రైతులు అగచాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్ద పడిగాప
దేవాదుల ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను తరలించి ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందుండాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. పీఎం కుసుమ్ యోజన ద్వారా సౌర విద్యుత్తును వినియోగించుకునేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. సౌర విద్యుత్తుపై