Indresham Municpality | సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఇంద్రేశం పురపాలికలో మొత్తం 18 వార్డులకుగాను అత్యధికంగా 9 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకోగా, ఆరు వార్డులు కాంగ్రెస్, రెండు వార్డులు బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.