Yash | రాకింగ్ స్టార్ యష్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. యష్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ గ్రాండ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. బెంగళూరులో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. యష్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, పబ్లిక్ కార్యక్రమాలకు నయనతార చాలా దూరంగా ఉంటారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ఆమె చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి నయనతార ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి స్వయంగా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈవెంట్లో ఆమె ఎంట్రీ ఒక్కసారిగా హైలైట్‌గా మారింది.
ఈ సందర్భంగా నయనతార మాట్లాడిన మాటలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. తాను ప్రమోషన్లకు రావడానికి ఇష్టపడనని కొందరు భావిస్తుంటారని, కానీ అసలు విషయం అది కాదని ఆమె చెప్పుకొచ్చారు. స్టేజ్‌పై మాట్లాడటం తనకు అంత సౌకర్యంగా ఉండదని, అందుకే ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటానని నయన్ వెల్లడించారు. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం తన నిర్ణయం మార్చుకున్నానని ఆమె తెలిపారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పిన నయనతార.. యష్ తనకు ఒక్కసారి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రావాలని అడిగారని, ఆయన అడిగిన వెంటనే తాను రావాలనుకున్నానని చెప్పుకొచ్చారు. యష్‌పై తనకున్న గౌరవాన్ని కూడా ఆమె మాటల్లో స్పష్టం చేశారు.
నయనతార స్వయంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరై.. యష్ కోసం ప్రత్యేకంగా మాట్లాడటంతో ‘టాక్సిక్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. ట్రైలర్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా యష్ కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్సులు, స్టైలిష్ మేకింగ్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.‘టాక్సిక్’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుండగా.. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా భారీ స్థాయిలో యాక్షన్, స్టైలిష్ విజువల్స్, డార్క్ టోన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. యష్ గత చిత్రాలతో పోలిస్తే ‘టాక్సిక్’లో ఆయన పాత్ర, కథా నేపథ్యం పూర్తిగా కొత్తగా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.