వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 27 : కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో కొనసాగుతున్న ఉత్కర్ష 24 వేడుకల్లో విద్యార్థుల సంబురాలు అంబరాన్నంటాయి. కేఎంసీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి, కళాశాల గత ప్రిన్సిపాల్స్ డాక్టర్ రమేశ్‌రావు, డాక్టర్ ఏఎన్ఆర్ లక్ష్మి,
డాక్టర్ సంధ్యారాణి, కళాశాల 1967 బ్యాచ్ పూర్వ విద్యార్ధి డాక్టర్ హనుమంతరావు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన ముగింపు వేడుకల్లో మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్‌రావు విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు. అనంతరం పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో వేడుకలు ముగిశాయి.