హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 22: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండలోని తిరుమల తిరుపతి కళ్యాణ మండపంలో తెలంగాణ అండర్-15 బాలబాలికల రాష్ట్రస్థాయి చదరంగ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వంద మంది చెస్ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్‌కుమార్, ఆర్బిటర్స్ సాయి ప్రదీప్ శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, వైశాలి, తదితరులు పాల్గొన్నారు.