జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కోర్కిశాల( Korkisala) గ్రామంలో వ్యవసాయ బావి ( Agriculture Well ) పూడిక తీస్తుండ గా ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడడంతో ముగ్గురు కూలీలు ( Laborers ) మృతి చెందారు. సుకినే వాసుదేవరావు (48), బండారి అభిలాష్ (16), పైడయ్య (53) ఈ ఘటనలో దుర్మరణం చెందారు. అభిలాష్ పదవ తరగతి పరీక్షలు రాసి కూలి పనికి వచ్చి మృత్యువా బాధపడ్డాడు.