హనుమకొండ చౌరస్తా : వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు ( Para Athletes ) ఏ.లోకేష్, పి.మమత ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ పారా అథ్లెటిక్స్గ్రాండ్ ప్రిక్స్పోటీల్లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. మార్చి 11 నుంచి 14 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పోటీలు జరిగాయి.

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఏ.లోకేష్ ( Lokesh , ఎఫ్-46 విభాగం) తన ప్రతిభను చాటుతూ జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాలలో రెండు కాంస్య పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని చాటారు. పి.మమత ( Mamata,ఎఫ్-55 విభాగం) కూడా అసాధారణ ప్రతిభ కనబరిచి షాట్‌పుట్, జావెలిన్‌త్రో విభాగాలలో రెండు కాంస్య పతకాలు సాధించారు.
వారి విజయంపై క్రీడా అధికారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ విజయాలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని వెల్లడించారు.