Landslides : ఎడతెరపిలేని వర్షాలు నాగాలాండ్ (Nagaland) రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉదయం కురిసిన కుండపోత వర్షానికి ఒక్కసారిగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పలు నివాసాలు కొండచరియల కింద నలిగిపోయాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు కొండచరియల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ (Rescue Teams) ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఇంకా వరదలు వస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు చెందిన సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనపై నాగాలాండ్ ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేసింది. ఘటనా ప్రాంతంలో దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.