Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేని ఇరాన్లో లేడా.. సౌదీ సంచలన ప్రకటన
Mojtaba Khamenei : మొజ్తాబా ఖమేని ఇరాన్లో లేడని సౌదీకి చెందిన అల్ హదాత్ అనే వార్తాసంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్లో లేడని చెప్పినప్పటికీ, ఎక్కడున్నాడు అనే విషయంలో స్పష్టత మాత్రం లేదు.
Mojtaba Khamenei : ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు అనే అంశంపై అనేక సందేహాలున్నాయి. ఆయన ఇరాన్లో ఉన్నారని కొందరు అంటుంటే.. రష్యాలో చికిత్స తీసుకుంటున్నారని ఇంకొందరు భావిస్తున్నారు. ఆయన స్థావరం విషయంలో స్పష్టత లేదు. అధికారికంగా ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. కానీ, తాజాగా ఈ అంశంపై సౌదీ సంచలన ప్రకటన చేసింది. మొజ్తాబా ఖమేని ఇరాన్లో లేడని సౌదీకి చెందిన అల్ హదాత్ అనే వార్తాసంస్థ వెల్లడించింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించాయి. ఇరాన్లో లేడని చెప్పినప్పటికీ, ఎక్కడున్నాడు అనే విషయంలో స్పష్టత మాత్రం లేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో మొజ్తాబా తండ్రి అయతొల్లా ఖమేనితోపాటు అతడి కుటుంబ సభ్యులు మరణించారు. ఈ ఘటనలో మొజ్తాబా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు బహిరంగంగా కనిపించింది లేదు. ఇటీవల జరిగిన తండ్రి, కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయన ఉనికిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాకు, ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఇటీవల మొజ్తాబా తన ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ పాల్గొనడం అమెరికాకు ఇష్టం లేదని కూడా సౌదీకి చెందిన అల్ హదాత్ సంస్థ అభిప్రాయపడింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేస్తున్నాసరే.. అమెరికాకు ఇజ్రాయెల్ యుద్ధం చేయడం ఇష్టం లేదని తెలిపింది. ఇక, ఇరాన్లో సరైన నాయకత్వం లేనందున అక్కడి నేతల మధ్య విబేధాలు చోటు చేసుకున్నట్లు కూడా ఆ సంస్థ వార్త ప్రచురించింది. ఐఆర్‌జీసీకి, అక్కడి నేతలకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇది యుద్ధంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- iran
- Israel
- Mojtaba Khamenei
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

