IND vs ENG | 192 వద్ద తొలి వికెట్.. సెంచరీ చేజార్చుకున్న బెథెల్..!
IND vs ENG : లార్డ్స్ వన్డేలో ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది. అర్ధ శతకం తర్వాత బౌండరీలతో రెచ్చిపోయిన ఓపెనర్ జాకబ్ బెథెల్(91)ను ప్రసిధ్ కృష్ణ(1-36) వెనక్కి పంపాడు.
IND vs ENG : లార్డ్స్ వన్డేలో ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి వికెట్ పడింది. అర్ధ శతకం తర్వాత బౌండరీలతో రెచ్చిపోయిన ఓపెనర్ జాకబ్ బెథెల్(91)ను ప్రసిధ్ కృష్ణ(1-36) వెనక్కి పంపాడు. భారత్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పిన బెన్ డకెట్(90 నాటౌట్), బెథెల్ జోడీని విడదీశాడు. శతకం కొట్టేలా కనిపించిన బెథెల్.. డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద రోహిత్ శర్మ చేతికి చిక్కాడు.
నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌కు తొలి బ్రేకిచ్చాడు ప్రసిధ్ కృష్ణ(1-36). బుమ్రా గైర్హాజరీలోని టీమిండియా పేస్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్(90 నాటౌట్), జాబ్ బెథెల్(91) ద్వయాన్ని విడదీశాడీ పొడగరి పేసర్.
First half-century as an England ODI opener for Jacob Bethell 👏🏽
England’s first century opening partnership in ODIs at Lord’s since 2010.#Cricket #ENGvIND
pic.twitter.com/SxZyJimjk0— CREX (@Crex_live) July 19, 2026
వీరిద్దరి జోరుతో పవర్ ప్లేను 58-0తో ముగించిన ఇంగ్లండ్.. భారీ స్కోర్ దిశగా సాగుతున్న దశలో ప్రసిధ్ డేంజరస్ బెథెల్‌ను వెనక్కి పంపాడు. దాంతో డకెట్‌తో తొలి వికెట్‌కు అతడు నెలకొల్పిన 192 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం జో రూట్ జతగా ఆడుతున్న డకెట్ సెంచరీకి చేరువయ్యాడు. 33 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 206-1.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

