నెక్కొండ, అక్టోబర్ 10: సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) అనే రైతు తన ఏడాది వయసున్న మనుమడిని తీసుకొని సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు సీరియల్ బల్బుల లైన్‌పై పడిపోవడం తో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
అతడిని రక్షించే ప్రయత్నం చేయగా మనుమడిని విడిచిపెట్టడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న యాకయ్యను నెక్కొండకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి భార్య లలిత, ఇద్దరు కూతుర్లు స్నేహ, రుచిత ఉన్నారు. కేసు నమో దు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.