Seyon Movie | కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ శివకార్తికేయన్ తన 26వ సినిమా అప్డేట్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గతేడాది ‘అమరన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న శివకార్తికేయన్-కమల్ హాసన్ కాంబో, ఇప్పుడు ‘సేయోన్’ (Seyon) అనే పవర్ఫుల్ ప్రాజెక్ట్‌తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 16న ఈ చిత్ర టైటిల్‌తో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు.
ఫస్ట్ గ్లింప్స్‌లో శివకార్తికేయన్ సాంప్రదాయ ధోతీ, విభూతి మరియు రుద్రాక్షలతో కనిపిస్తూనే, చేతిలో కాగడా పట్టుకుని ఊగిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. శివకార్తికేయన్ పాత్ర చూస్తుంటే.. ఈ సినిమా తమిళ దేవుడు మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) అంశతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ‘సేయోన్’ అంటే రాజు అని అర్థం. మురుగన్‌ని తమిళంలో ‘సేయోన్’ అని కూడా పిలుస్తారు. లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ (RKFI)పై ఆర్. మహేంద్రన్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అమరన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరు కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మొదటి చిత్రం ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi) విడుదలకు ముందే శివకార్తికేయన్ ఆయన ప్రతిభను గుర్తించి ఈ భారీ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.