ముంబై: టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ప్రస్తుతం టాప్ఫామ్లో ఉన్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అతను 77 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే క్రికెటర్ ఇషాన్ ప్రస్తుతం ఓ మోడల్‌తో డేటింగ్ చేస్తున్నాడు. ఆ మోడల్ పేరు అదితి హుందై. ఇషాన్ తన పెళ్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని స్వాగతిస్తామని అతని తాతయ్య అనురాగ్ పాండే తెలిపారు. మోడల్ అదితితో ఇషాన్ రిలేషన్లో ఉన్నాడన్న విషయాన్ని అతని తాతయ్య కన్ఫర్మ్ చేశాడు.
సుమారు రెండు ఏళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ ఇటీవల పురాగమనం తర్వాత మంచి ఊపుమీదున్నాడు. భారీ స్కోర్లు చేస్తూ జట్టును ఆదుకుంటున్నాడు. అయితే అతని మ్యారేజ్ విషయంలో మాత్రం నిర్ణయాన్ని అతనికే వదిలివేయనున్నట్లు తాతాయ్య చెప్పాడు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఉన్న అనురాగ్ పాండే తన మనవడు ఇషాన్ కిషన్ డేటింగ్ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఎవర్ని పెళ్లి చేసుకోవాలని ఇషాన్ భావిస్తాడే, అతని నిర్ణయాన్ని పూర్తిగా ఆమోదిస్తామన్నాడు. ఇషాన్ గర్ల్‌ఫ్రెండ్ ఓ మోడల్ అని, అదితి అతని గర్ల్‌ఫ్రెండ్ అని, ఆమె ఓ మోడల్ అని, పిల్లల సంతోషాన్ని కాదనకూడదని పాండే అన్నారు.
#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, “…We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend…She is a model…One should accept what makes children happy…” (14.03) pic.twitter.com/narb5aZHtx
— ANI (@ANI) February 14, 2026