KCR Birthday | చిగురుమామిడి, ఫిబ్రవరి 17: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి కేసీఆర్ పేద ప్రజలకు చేరువయ్యారని అన్నారు. తెలంగాణ వస్తుందో రాదో అన్న మీమాంసలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలకు భరోసాగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నా, లేకున్నా క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడు అండగా ఉంటూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని అన్నారు.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్, రవి రేటినేని, చెప్యాల యశ్వంత్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, మాజీ అధ్యక్షులు దూసరి అశోక్ గౌడ్, కార్యదర్శి ఐటీ మీడియా ఇంచార్జి ప్రదీప్ పులుసు, ఈవెంట్స్ ఇంచార్జి లునావత్ తరుణ్, సభ్యులు అబ్దుల్ కుద్దూస్, ఇమ్రాన్, హరీష్ రెడ్డి, జనార్దన్, అస్లాం, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.