కాజీపేట, సెప్టెంబర్ 28 : కాజీపేట పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని అపహరించు కుపోయిన ఘటన శనివారం కలకలం సృష్టించింది. బాధితులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకా రం.. వరంగల్ రంగశాయిపేట ప్రాంతానికి చెందిన ఎస్కే మసూ ద్-కౌసర్ దంపతులు బతుకుదెరువు కోసం జనగామకు వెళ్లేందుకు తమ కుమారులు అయాన్ (5), ఇఫ్తాన్ను తీసుకుని శుక్రవారం సాయంత్రం కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
ఆ సమయంలో రైళ్లు లేకపోవడంతో రైల్వే ఇనిస్టిట్యూట్ గేట్ సమీపంలో ఉన్నారు. కౌసర్ ఇఫ్తాన్ను తీసుకుని ఆహారం తీసుకొచ్చేందుకు చౌరస్తాకు వెళ్లింది. కొంత సమయం తర్వాత మసూద్ అయాన్‌ను ఇనిస్టిట్యూట్ గేట్ సమీపంలోనే వదిలి లగేజీని పట్టుకుని రైల్వే స్టేషన్లోకి వెళ్లాడు. భార్యాభర్తలు కొద్దిసేపటికి అక్కడకు చేరుకోగా, అయాన్ కనిపించక పోవడంతో ఆ ప్రాంతమంతా వెతికారు.
ఈ క్రమంలో అక్క డ ఉన్నవారు ముస్లిం దంపతులు అయాన్‌ను ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచా రం అందించగా ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి అక్కడివారి ని అడిగి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి అయాన్ కోసం వెతుకుతున్నామని జాడ తెలియడం లేదని, పోలీసులను అడిగితే వెదుకుతున్నాం.. దొరకలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ పట్టించుకోవడం లేదని ఆ దంపతులు వాపోయారు.