నర్సంపేట, అక్టోబర్ 4 : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాసం ఫ్యాషన్స్ 14వ స్టోర్‌ను సినీనటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధునాతన కలెక్షన్లతో, నిత్య నూతన వెరైటీలతో కాసం ఫ్యాషన్స్ పేరు గాంచిందన్నారు. ఈ స్టోర్‌ను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
నర్సంపేటకు వచ్చిన అనసూయను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టోర్ వద్దకు చేరుకోగా ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. స్టోర్ నిర్వాహకు లు మాట్లాడుతూ తెలుగు రాష్ర్టాల్లో నాలుగేళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ నూతన డిజైన్లతో కూడిన దుస్తులను గ్రామీణ ప్రజలకు తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాసం నమఃశివాయ, మల్లికార్జున్, కేదారీనాథ్, శివప్రసాద్, ఫణి, సాయికృష్ణ, ధీరజ్, డాక్టర్ ప్రీతం, యాంసాని ప్రవీణ్ పాల్గొన్నారు.