వరంగల్ : వారంతా ప్రాణాలు పణంగా పెట్టి శాంతిభత్రలను కాపాడే చిరుద్యోగులు. ప్రజల మాన, ప్రాణాలను కాపాడే పోలీసులకే సెలవులు దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో బాధిత కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు (Protest) చేపడుతున్నారు. తాజాగా కానిస్టేబుల్స్‌తో వెట్టిచాకిరి చేయిస్తూ కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తూ వరంగల్(Warangal )జిల్లాలోని నాలుగో బెటాలియన్(Fourth Battalion) వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబాలు(Constables families) ధర్నా చేపట్టారు.
ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్ నినాదంతో రోడ్డుపై బైఠాయించి నిరసనతెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కానిస్టేబుల్స్‌కు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.