Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ -50 సూచీ నిఫ్టీ మంగళవారం తీవ్ర నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ -50 సూచీ నిఫ్టీ మంగళవారం తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కో శాతం చొప్పున పతనం అయ్యాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 930.55 పాయింట్ల పతనంతో 80,220.72 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 309 పాయింట్ల నష్టంతో 24,472 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 1001.74 పాయింట్ల వరకూ పతనమైంది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం మూడే మూడు స్టాక్స్ ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్ మాత్రమే లాభ పడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంకు, మారుతి సుజుకి తదితర స్టాక్స్ నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50లో కేవలం తొమ్మిది స్టాక్స్ మాత్రమే లాభ పడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా,ఆల్ట్రాటెక్ సిమెంట్ తదితర స్టాక్స్ పుంజుకున్నాయి. మరోవైపు అదానీ ఎంటర్ ప్రైజెస్, బీఈఎల్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ నష్టపోయాయి.
ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ 3.59 శాతం, రియాల్టీ 3.39 శాతం, మెటల్, ఆటో, కన్జూరబుల్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్సులు 2-3 శాతం మధ్య నష్టాలతో ముగిశాయి. బ్యాంకు, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇండెక్సులు 0.55 నుంచి రెండు శాతం మధ్య పతనం అయ్యాయి. నిఫ్టీ బ్రాడ్ మార్కెట్ ఇండెక్సుల్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 3.62 శాతం, మిడ్ క్యాప్ 2.35 శాతం నష్టాలతో ముగిశాయి.