స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
Nava Kishore Das | ఆదివారం ఉదయం ఎఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఒడిశా మంత్రి నవ కిశోర్ దాస్.. భువనేశ్వర్ దవాఖానలో చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు.
తప్పుడు పన్నుల ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్‌ను ప్రభుత్వం నుంచి ప్రధాని రిషి సునక్ తొలగించారు. ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు.
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జొకోవిచ్ ఎగురేసుకుపోయాడు. ఈ టైటిల్‌ను 10 సార్లు గెలుచుకున్న జొకోవిచ్.. నాదల్ రికార్డును కూడా సమం చేశాడు.
యజమానికి మాటలు రాకపోవడంతో ఓ అందమైన పిల్లి సంజ్ఞలతో మాట్లాడటం నేర్చుకుంది. ఆకలవుతున్నది.. ఆహారం పెట్టు.. అంటూ సంజ్ఞలతో వేడుకుంటున్న వీడియో ఆకట్టుకుంటున్నది.
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయిన ట్రక్కు జనంపైకి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు - మన బడి మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న పండుగ వాతావరణంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.