తెలంగాణ – ఏపీ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీప తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం గిరిజనులను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. కొన్ని నెలల క్రితం కా వడిగుండ్ల అడవుల్లో సంచరించిన పెద్దపులి.. పశువులపై దాడిచేసింది.
- రాకొండ, ఖానాపురం శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచారం
- తీవ్ర భయాందోళనచెందుతున్న ఆయా గ్రామాల్లోని ప్రజలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పిన అటవీ శాఖ అధికారులు
నర్సంపేట(ఖానాపురం)/మరికల్/అశ్వారావుపేట, జూన్ 28 : భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీప తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెద్దపులి సంచారం గిరిజనులను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. కొన్ని నెలల క్రితం కా వడిగుండ్ల అడవుల్లో సంచరించిన పెద్దపులి.. పశువులపై దాడిచేసింది. ఆంధ్రప్రదేశ్ అడవుల నుంచి జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మీ దుగా పెద్దపులి రాజమండ్రి వరకు వెళ్లగా అక్క డ అటవీ అధికారులు పట్టుకొని జీపీఎస్ అ మర్చారు. దాని ఆధారంగా ఆదివారం భద్రా ద్రి జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల సమీపంలోని ఆంధ్రా అడవుల్లో సంచరిస్తున్నట్టు అశ్వారావుపేట అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం అశ్వారావుపేట మండలం గుబ్బలమంగమ్మ ఆలయం, కావడిగుండ్ల అటవీకి దగ్గరగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. ఇదే మండలంలోని కావడిగుం డ్ల, చెన్నాపురం, గోపన్నగూడెం, కన్నాయిగూ డెం గ్రామాల్లో జీపులో మైక్‌తో ప్రచారం చే స్తూ గిరిజన గ్రామాల ప్రజలు అడవుల్లోకి వె ళ్లొద్దని, పశువులను అటవీ ప్రాంతంలో ఉం చొద్దని సూచించారు. పెద్దపులి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే ఉన్నట్టు గుర్తించామని, అడవుల్లోకి వెళ్లకుండా సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అశ్వారావుపేట ఫా రెస్ట్ రేంజ్ అధికారి మురళి తెలిపారు. నా రాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రా కొండ సమీపంలోని గుట్టపై గత మూడు రో జులుగా చిరుత సంచరిస్తున్నట్టు రైతులు గుర్తించారు. వ్యవసాయ పనుల సీజన్ కావడం తో రైతులు, మహిళలు ఎక్కువగా పొలాలకు వెళ్తుంటారని, అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వ రంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పొ లాల్లో చిరుత పులి పాదముద్రలు, ఆనవాళ్ల ను అధికారులు గుర్తించారు. ఖానాపురం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వెనకాల (రాగంపేట శివారులో) వ్యవసాయ భూము ల్లో రైతులు కొన్నేండ్లుగా పామాయిల్ తోటలు సాగుచేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము న ఖానాపురానికి చెందిన నాగకు పామాయి ల్ తోటలో సంచరిస్తున్న చిరుతపులి కనిపించడంతో తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. పో లీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రామ్మోహన్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది చిరుత సంచరించిన ప్రాంతానికి వెళ్లి సమీపంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఖానాపురం, మనుబోతులగడ్డ మీదుగా పాకాల అటవీ ప్రాంత వరకు చి రుత పాదముద్రలు ఉన్నట్లు నిర్ధారించారు. చిరుత వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిందని, చు ట్టుపక్కలగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని అటవీ అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలను జైలు నుంచి తీసుకెళ్లి ఇంటి శుభ్రం.. జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

