కేఎం (కృష్ణమోహన్), పూజా సుందర్‌శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ లైఫ్ బ్రో’. సోమశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణమోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘యథార్థ సంఘటనల ఆధారంగా తయారుచేసుకున్న ప్రేమకథ ఇది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అన్నారు. రాజీవ్ కనకాల, ఛమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవిప్రసాద్, కిరిటీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాహిత్య సాగర్, కథ, స్క్రీన్‌ప్లే: ఇ.రాజయ్య, దర్శకత్వం: కృష్ణమోహన్ సల్లగుండ్ల.