డా.ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సందేశాత్మక చిత్రం ‘ఆర్కే దీక్ష’. కిరణ్, అక్సాఖాన్, అలేఖ్యారెడ్డి ప్రధానపాత్రలు పోషించిన ఈ చిత్రంలో తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రధారులు. జూలై 3న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘సినిమా బాగా వచ్చింది. సాంకేతికంగా అన్ని విధాలా అభినందనీయంగా ఉంటుంది. ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తయింది. నైజాంలోనే థియేటర్లు ఇవ్వడంలేదు. ఇదే తీరు కొనసాగితే, తప్పకుండా పోరాటం మొదలుపెడతాం. సోమవారం నుంచి ఫిల్మ్‌ఛాంబర్ ముందు నిరాహార దీక్ష చేపడతాం. ఈ సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంది. తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం’ అని ప్రతాని రామకృష్ణగౌడ్ చెప్పారు. ఈ సినిమాలో ఫైట్స్ అద్భుతంగా ఉంటాయని, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌ని ఇండస్ట్రీలో కొందరు తక్కువ అంచనా వేస్తున్నారని, థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఫైట్ మాస్టర్ రవి పేర్కొన్నారు. ఇంకా హీరో కిరణ్, నటి తులసి కూడా మాట్లాడారు.