లక్నో: మొదటి అంతస్తులోని ఇంటి బాల్కానీలో ఉన్న ఒక వ్యక్తి ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. వీధి వ్యాపారి నుంచి ఐఎస్క్రీమ్ అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోయిన అతడు ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందపడ్డాడు. (Man Leans Over To Get Ice Cream) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రేణుకూట్లోని హిండాల్కో కాలనీలో నివసిస్తున్న వ్యక్తి ఇంటి మొదటి అంతస్తు బాల్కానీలో నిల్చొన్నాడు. అక్కడి నుంచి ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు.
కాగా, వీధి వ్యాపారి తన చేతిలోని ఐస్‌క్రీమ్‌తో అక్కడకు చేరుకున్నాడు. గోడపైకి ఎక్కి దానిని అందించేందుకు ప్రయత్నించాడు. అయితే ఐస్‌క్రీమ్ అందుకునేందుకు వంగిన వ్యక్తి ఒక్కసారిగా అదుపుతప్పాడు. దీంతో ఇంటి మొదటి అంతస్తులోని బాల్కానీ నుంచి కిందకు పడిపోయాడు. ఇది చూసి ఆ వీధి వ్యాపారి షాక్ అయ్యాడు.
మరోవైపు గమనించిన స్థానికులు పరుగున ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నారు. గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోన్‌భద్ర పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు. గాయపడిన ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలేవీ లేవని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
मतलब आलस और लापरवाही
फिर क्या हुआ अंत तक देखिएसोनभद्र, रेणुकूट pic.twitter.com/DGIRE9149j
— Sachin Dubey (@iamsachindubey) June 25, 2026