– న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జిలు కె.సురేశ్, భవ్య
కోదాడ, జూన్ 27 : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కోదాడలోని తేజ విద్యాలయం, సనా ఇంజినీరింగ్ కళాశాలలో వేరువేరుగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. తమ జీవితాలలో వెలుగులు నింపుకునేందుకు లక్ష్యాలను నిర్దేశించుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.
తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలన్నారు. మత్తు పదార్థాలకు లోనై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితులను కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల జోలికి వెళ్లమంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదస్సులలో గ్రామీణ ఎస్ఐ గోపాల్ రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, కళాశాల ప్రిన్సిపాల్ గోపిరెడ్డి, న్యాయవాదులు ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, యశ్వంత్, రామారావు, ఉయ్యాల నరసయ్య, నవీన్, హుస్సేన్, శరత్ కుమార్, రియాజ్, అధ్యాపకులు, న్యాయశాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.