లక్నో: ఎక్స్‌ప్రెస్ వేపై ప్రయాణించిన కారు ఎగ్జిట్ వే మిస్సయ్యింది. దీంతో డ్రైవర్ ఆ కారును రివర్స్‌లో నడిపాడు. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో ఎస్యూవీ దానిని ఢీకొట్టింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Car Missed exit turns deadly) హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం హరిద్వార్‌లోని గంగానదిలో పుణ్యస్నానం, ఆలయ దర్శనం కోసం కారులో బయలుదేరారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై అది ప్రయాణించింది.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్ జిల్లాలో ‘హల్గోయా కట్’ సమీపంలో ఎగ్జిట్ వేను కారు డ్రైవర్ మిస్ అయ్యాడు. దీంతో ఆ కారును రివర్స్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన స్కార్పియో ఎస్యూవీ బలంగా ఢీకొట్టింది. ఆ కారును కొంతదూరం ఈడ్చుకెళ్లిన స్కార్పియో అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది.
మరోవైపు ఈ ప్రమాదంలో ఆ కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులను ప్రవీణ్ (40), అతడి భార్య ప్రీతి (37), వృద్ధురాలైన తల్లి సుదేశ్, తొమ్మిదేళ్ల శివాన్ష్గా పోలీసులు గుర్తించారు.
ఆ కుటుంబానికి చెందిన మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली–देहरादून एक्सप्रेस वे पर सहारनपुर (यूपी) में रोड एक्सीडेंट में 3 लोगों की मौत हो गई। Tiago कार बैक हो रही थी, तभी स्कॉर्पियो की टक्कर लग गई।@AmitGup96968797 pic.twitter.com/l4Q4I7y9Gv
— Sachin Gupta (@Sachingupta) June 28, 2026