ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ
ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మిస్తున్న ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై బాలాజీ గుట్ట, కౌశిక్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిరామ్ నాయుడు దర్శకుడు.
ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని నిర్మిస్తున్న ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై బాలాజీ గుట్ట, కౌశిక్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిరామ్ నాయుడు దర్శకుడు. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రధారులు. పృథ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రధారులు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని ఆదివారం హైదరాబాద్‌లో మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటీమణులు అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, సునయన, నటుడు వంశీధర్‌గౌడ్ ఆనందం వెలిబుచ్చారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది. టీజర్ చూసి ఇది అమ్మాయిల కోసం తీసిన సినిమా అనుకుంటే పొరపాటే. ఇది అబ్బాయిల కోసం తీసిన సినిమా. స్త్రీలు బయటకు చెప్పలేని ఎన్నో భావోద్వేగాలను ఇందులో చూపించాం. కుటుంబంతో కలిసి చూస్తే మంచి అనుభూతినచ్చే సినిమా ఇది’ అని దర్శకుడు అభిరామ్ నాయుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా సహ నిర్మాత తరుణ్‌రెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి: కెమెరా: మణికందన్ సుబ్రమణియన్, సంగీతం: శేఖర్‌చంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

