Novak Djokovic | ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంప్‌గా జొకోవిచ్.. నాదల్ రికార్డు సమం చేసిన నొవాక్
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్‌ను మరోసారి జొకోవిచ్ ఎగురేసుకుపోయాడు. ఈ టైటిల్‌ను 10 సార్లు గెలుచుకున్న జొకోవిచ్.. నాదల్ రికార్డును కూడా సమం చేశాడు.
Djokovic | ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచులో గ్రీస్ ఆటగాడిని మట్టికరిపించి టైటిల్ గెలుచుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మెల్బోర్న్ వేదికగా ఫైనల్ జరిగింది. 15 ఏండ్ల క్రితం మెల్బోర్న్ పార్క్ మైదానంలో తన తొలి టైటిల్ అందుకున్న జొకోవిచ్.. తన కెరీర్లో 10 సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి ఆటగాడిగా నిలిచారు. అలాగే, ఎక్కువ టైటిళ్లు గెలిచి నాదల్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 6-3, 7-6, 7-6తో గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించాడు. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. ఈ టైటిల్‌ను 10వ సారి గెలుచుకున్నాడు. 35 ఏళ్ల జొకోవిచ్‌కి ఇది 22వ గ్రాండ్‌స్లామ్. అత్యధిక టైటిళ్లను గెలుచుకుని స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. నాదల్ 22 మేజర్ టైటిళ్లను సాధించాడు. రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్‌లో 14) తర్వాత ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో కనీసం 10 టైటిళ్లను గెలుచుకున్న 2వ వ్యక్తి కూడా జొకోవిచ్ కావడం విశేషం.
🏆 🏆 🏆 🏆 🏆 CHAMPION 🏆 🏆 🏆 🏆 🏆@DjokerNole has mastered Melbourne for a TENTH time!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/ZThnTrIXdt
— #AusOpen (@AustralianOpen) January 29, 2023
గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్ ఖచనోవ్పై గెలిచి తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరాడు. సిట్సిపాస్ తన కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. కొవిడ్ ప్రోటోకాల్స్ కారణంగా 2021 ఛాంపియన్షిప్ పోటీలకు జొకోవిచ్ ఆడలేకపోయాడు. వాస్తవానికి పోటీలో పాల్గొనడానికి కొవిడ్ టీకాను టోర్నమెంట్ నిర్వాహకులు తప్పనిసరి చేశారు. అయితే నొవాక్ తాను కొవిడ్ టీకా తీసుకున్న సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో 2022 పోటీల్లో ఆయన పాల్గొనకుండా వేటు వేశారు. కాగా, బెలారస్‌కు చెందిన అరినా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

