Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Man, Father Paraded Naked | ఒక బాలికతో యువకుడికి ఉన్న ప్రేమ సంబంధం గురించి ఆమె బంధువుకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ యవకుడు, అతడి తండ్రితోపాటు స్నేహితుడిని బాలిక కుటుంబ సభ్యులు కొట్టారు. చంపుతామని తుపాకీతో బెదిరించారు. వారిని నగ్నంగా ఊరేగించి శిక్షించారు.
కోల్‌కతా: ఒక బాలికతో యువకుడికి ఉన్న ప్రేమ సంబంధం గురించి ఆమె బంధువుకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ యవకుడు, అతడి తండ్రితోపాటు స్నేహితుడిని బాలిక కుటుంబ సభ్యులు కొట్టారు. చంపుతామని తుపాకీతో బెదిరించారు. వారిని నగ్నంగా ఊరేగించి శిక్షించారు. (Man, Father Paraded Naked) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. బెహాలా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు, ఫ్రెండ్‌తో కలిసి ప్రియురాలైన బాలికను కలిశాడు. మాట్లాడే సమయంలో ఆ యువకుడు ఆమెను ముద్దుపెట్టుకున్నాడు.
కాగా, బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తి ఇది చూశాడు. ఆమె తండ్రి, బంధువులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. యువకుడు, అతడి స్నేహితుడ్ని నిర్బంధించారు. ఖుదిరాంపల్లిలోని తమ ఇంటికి వారిని తీసుకెళ్లారు. యువకుడ్ని ఇంట్లో బంధించి కొట్టారు. అతడి తండ్రిని అక్కడకు పిలిపించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆ ముగ్గురిపై దాడి చేశారు. వారి దుస్తులు విప్పించారు. నగ్నంగా నడవాలని లేకపోతే కాల్చిచంపుతామంటూ తుపాకీతో బెదిరించారు. ఆ వీధిలో కొంతదూరం వరకు ఆ ముగ్గురిని నగ్నంగా ఊరేగించి శిక్షించారు.
మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రితో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

