రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యాంగానికి లోబడి స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేని యెడల తన పదవికి రాజీనామ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని జుగుప్సాకరమైన శీర్షికలు పెడుతూ, వార్తలు ప్రసారం చేయడంతో సరికాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ అన్నారు.
ఉపాధ్యాయ, పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 న మెదక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని యుఎస్పిసి నాయకులు కోరారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు కలెక్షన్ కింగ్ల వ్యవహరిస్తున్నారని ప్రతి దరఖాస్తుకు డబ్బు లేకుండా ప్రొసీడింగ్స్ అందించడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు.