కాజీపేట, నవంబర్ 18 : కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయ వెలుగు చూసింది. జి ఆర్ పి సీఐ నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే అధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
కాగా, మృతుడు 55- 60 మధ్య వయసు, 5’6 ఎత్తు, చామన చాయ రంగు ఆకారం, తెల్లని తల వెంట్రుకలు గడ్డం, మీసాలు, కలిగి ఉన్నారు. మృతుడు ఒంటిపై బ్లూ కలర్ జీన్ పాయింట్, తెలుపు, గోధుమ రంగు ఆఫ్ టీ షర్ట్ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్ర పరిచామన్నారు. మృతునికి ఎవరైనా సంబంధీకులు ఉన్న, గుర్తు పట్టిన కాజీపేట జి ఆర్ పి లో లేదా, 9849198382, 9948348070 సెల్ నంబర్లలో సమాచారం తెలుపాలన్నారు.