పెద్దపల్లి, నవంబర్18: డ్రగ్స్‌రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, డీసీపీ కరుణాకర్‌తో కలిసి కలెక్టర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మాదకద్రవ్యాలు నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా మన వంతు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీసీ గజ్జి కృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బీ వనజ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.