ఎదులాపురం, ఫిబ్రవరి 21 : పాత మొబైల్ ఫోన్లతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మహమ్మద్ ఆసిఫ్, అజామ్ ఖురేషిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. శనివారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పాత మొబైల్ ఫోన్లు తకువ ధరకు కొనుగోలు చేసి, వాటిలోని డేటా, సిమ్ కార్డులు, ఐఎంఈఐ నంబర్లు సేకరించేవారు.
అలాగే బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటిస్తూ అమాయక ప్రజలను ఓటీపీలు అడిగి మోసం చేసి వారి ఖాతా నుంచి డబ్బులు దోచుకునేవారని విచారణలో వెల్లడైందన్నారు. స్రాప్ మొబైల్ భాగాలను హైదరాబాద్‌లో విక్రయిస్తూ లాభం పొందుతున్నట్లు నిందితులు అంగీకరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి.విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.