Thorrur | తొర్రూరులో కాంగ్రెస్ నీచ రాజకీయం.. చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా మధుసూదనచారిని అడ్డుకున్న పోలీసులు
Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో చైర్మన్ ఎన్నికను వాయిదాను ఇవాల్టికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నది.
ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా ఇంచార్జిలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరు వెళ్లకుండా మహబూబాబాద్‌ఋలోనే సత్యవతి రాథోడ్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఇక మధుసూదనచారిని అమరావతి నగర్‌లోని తులసీ బార్ ఎదురుగా ఉన్న శాంతినికేతన్ అపార్ట్మెంట్లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా కాంగ్రెస్ నీచ రాజకీయాలు
తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడడంతో మధుసూదనాచారిని ఇంఛార్జిగా వేసిన బీఆర్ఎస్
దీంతో తొర్రూరు వెళ్లకుండా మధుసూదనా చారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/QrZq72mDtJ pic.twitter.com/tyL6l9784U
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2026
తొర్రూరులో హైటెన్షన్
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం నాడు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. నిన్న ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి తొర్రూరుకు చేరుకున్నారు. అయితే, అన్నారం రోడ్డు వద్ద ఆయనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం తెలుపడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. భారత పౌరసత్వం లేని వ్యక్తిని కార్యాలయంలోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నిస్తూ, స్థానిక ప్రజాప్రతినిధిగా సేవలందించిన మాజీ మంత్రి దయాకర్‌రావును అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పోలీసులు ఝాన్సీరెడ్డిని అకడి నుంచి పంపించారు. అనంతరం వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకునే క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
ఒకే ఓటును రెండుచోట్ల వినియోగించొద్దని అంటూ ఖమ్మంవరంగల్ జాతీయ రహదారిపై కారుకు అడ్డంగా బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ లాఠీచార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టి, ఎంపీని అనుమతించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో దయాకర్‌రావు పీఏ భాసర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఆయనను రక్షించారు. విషయం తెలుసుకున్న దయాకర్‌రావు మున్సిపల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

