నర్సింహులపేట : మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సింహులపేట ఎస్ఐ మాలోత్ సురేష్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని చౌరస్తాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు దుర్వినియోగ నివారణ, వినియోగం తగ్గించే కార్యక్రమం నిర్వహించి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవాల్సి వస్తుందన్నారు. మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదకద్రవ్యాల వాడకం ఒకటని అన్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. సమాజం కోసం పాటుపడాలని ఎస్ఐ సురేష్ సూచించారు.