చండీఘడ్: పంజాబ్లోని మొహాలీలో ఉన్న కొన్ని స్కూళ్లు, ఆస్పత్రులకు బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చాయి. ఫోర్టిస్ ఆస్పత్రికి కూడా బెదిరింపు వచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఫోర్టిస్ ఆస్పత్రిలో ప్రస్తుతం అత్యవసర విభాగం మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు చెప్పారు. నగరంలోని అన్ని స్కూళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఫోర్టిస్ ఆస్పత్రిలో సీఎం భగవంత్ మాన్ సోమవారం చికిత్స కోసం చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను పెంచారు. హెల్త్ ఫెసిలిటీ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే మళ్లీ ఆయన ఆస్పత్రిలో చేరారు.
బుధవారం మొహాలీలోని 16 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్ల నుంచి విద్యార్థుల్ని తరలించారు. అయితే ఎటువంటి అనుమానాస్పద పేలుడు పదార్ధాలు లభించలేదు. ఇటీవల చండీఘడ్, అమృత్సర్, జలంధర్, పాటియాలా, హర్యానా స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చాయి. అవన్నీ నకిలీ బెదిరింపులు అని నిర్ధారించారు. ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ పేరుతో బాంబు బెదిరింపులు వచ్చాయి.