Amitabh Bachchan | 83 ఏళ్ల వయసులోనూ అదే జోష్.. 24 గంటలు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసిన అమితాబ్ బచ్చన్!
Amitabh Bachchan | 83 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఎనర్జీ, వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18 (KBC 18)’ షూటింగ్ కోసం ఆయన ఏకంగా 24 గంటల పాటు నిరవధికంగా పని చేశారు. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించారు.
Amitabh Bachchan | 83 ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఎనర్జీ, వృత్తిపట్ల ఉన్న అంకితభావంతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18 (KBC 18)’ షూటింగ్ కోసం ఆయన ఏకంగా 24 గంటల పాటు నిరవధికంగా పని చేశారు. ఈ విషయాన్ని బిగ్ బీ స్వయంగా తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించారు.అమితాబ్ బచ్చన్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన షూటింగ్ మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఎలాంటి విరామం లేకుండా కొనసాగింది. KBC 18 ప్రసార తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో నిర్ణీత గడువులోగా షూటింగ్ పూర్తి చేయాల్సిన అవసరం ఉండటంతో ఈ సుదీర్ఘ షిఫ్ట్‌లో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 10 నుంచి KBC 18 టెలికాస్ట్ ప్రారంభం కానుండటంతో షెడ్యూల్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అమితాబ్ అన్నారు. ప్రసార తేదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ సమయంలో నేను అందుబాటులో లేకపోయినా, ఆలస్యం చేసినా నా స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే చేయాల్సిన పనిని సమయానికి పూర్తి చేశాను అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. 2000లో ప్రారంభమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ దాదాపు అన్ని సీజన్లలో హోస్ట్‌గా వ్యవహరించారు. మూడో సీజన్‌కు మాత్రమే నటుడు షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, 83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ చూపిస్తున్న క్రమశిక్షణ, వృత్తిపరమైన నిబద్ధత అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంటోంది.
మరోవైపు అమితాబ్ సినిమాలతో కూడా బిజీగా ఉంటున్నారు. ఆయన హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషలలో కూడా నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. కల్కి చిత్రంలో తన పాత్రతో అదరగొట్టిన అమితాబ్ బచ్చన్ ఇప్పుడు కల్కి 2 కోసం సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
Anurag Thakur: ఆరోపణలు చేస్తాడు.. కోర్టులో క్షమాపణలు చెప్తాడు.. ఇదీ రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డు
Jobs DRDO | హైదరాబాద్ డీఆర్డీవోలో 195 అప్రెంటిస్ ఖాళీలు.. నవంబర్ 1 చివరితేదీ
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

