కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామ్రాజ్యవాద విధానాలకు మద్దతు ఇస్తూ భారతదేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు విమర్శించారు.
కాజీపేట రైల్వే జంక్షన్ క్రూ డిపో కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు లింకులను విజయవాడకు తరలించేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరాపూర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను చించి వేశారు.
ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని, నాలుగు రూములుగా, పెద్దగా కట్టుకుంటే మాత్రం బిల్లులు రావని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.