హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలని రాష్ట్ర మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, శంకర్‌నాయక్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని అసోసి యేన్ ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.